News10th Aug 03:10 PMSunil Byrisetty1 min read
దివ్యాంగులకు ఉచిత మోటారు వాహనాలు
రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (APDASCAC)
రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (APDASCAC) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసి అయి, 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు. కనీసం పదో తరగతి పాసవ్వాలి. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు, SSC ధ్రువపత్రం, SC, ST అయితే కుల ధ్రువీకరణపత్రం, దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్పోర్టు సైజులో ఉన్నది. ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2022 తరువాత తీసుకొని ఉండాలి)
Banafide Certificate ( విద్యార్థి అయితే), ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదని సెల్ఫ్ డిక్లరేషన్ అందజేయాల్సి ఉంటుంది. మహిళలకు 50%, పురుషులకు 50% అందులో SC-16%, ST -7%
General - 77% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. SC & ST మహిళల & పురుషులలో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచో మరొకరికి వారికి ఇవ్వటం జరుగును. PG విద్యార్థులు లేదా Self/Wage/Salary పొందుతూ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత. ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. www.apdascac.ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.