News18th Aug 08:59 AMSunil Byrisetty1 min read

వర్షాలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం!

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కృష్ణా నదికి వరద పోటెత్తుతుండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస

వర్షాలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం!
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కృష్ణా నదికి వరద పోటెత్తుతుండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నష్ట నివారణ చర్యలను హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 292354 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2, 92, 354 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 11.2 అడుగులుగా ఉంది. బ్యారేజీ వద్దకు వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
Andhra Pradesh rains
Krishna river floods
government alert
flood precautionary measures
Home Minister Anitha
Prakasam barrage
వరద నియంత్రణ
భారీ వర్షాలు ఏపీ
Scroll for the next article