News18th Apr 11:10 AMSunil Byrisetty1 min read
పాస్టర్‌లకు ప్రభుత్వం గుడ్ ఫ్రైడే గిఫ్ట్
ఏపీలోని పాస్టర్లకు గుడ్ ఫ్రైడే ముందు రోజు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏపీలోని పాస్టర్లకు గుడ్ ఫ్రైడే ముందు రోజు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదలయ్యాయి.
ఏడు నెలల కాలానికి గాను రూ.30 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం.
7 నెలలకు గాను ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్ధి చేకూరనుంది.
యువగళం పాదయాత్రలో పాస్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో గౌరవ వేతనం అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.