News25th Aug 04:27 PMSunil Byrisetty1 min read

శుభవార్త.. ఖాతాల్లో తల్లికి వందనం సొమ్ము..!

తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. విద్యా శాఖపై సమీక్ష సమావే

శుభవార్త.. ఖాతాల్లో తల్లికి వందనం సొమ్ము..!
తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమ కానుంది. మరోవైపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో విద్యార్థికి ఈ పథకం కింద రూ.15 వేలు కేటాయిస్తున్న ప్రభుత్వం.. అందులో రూ. 13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసి.. మిగిలిన రూ. 2 వేలు పాఠశాల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.
Andhra Pradesh
Thalliki Vandhanam Scheme
Nara Lokesh
Education Department
Fee Reimbursement
Student Welfare
AP Government
Direct Benefit Transfer
ఫీజు రీయింబర్స్‌మెంట్
తల్లికి వందనం పథకం
Scroll for the next article