News22nd Jul 05:20 PMSunil Byrisetty1 min read

జీవో నంబర్-3 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం

గిరిజనుల సమస్యలపై సమగ్ర చర్చలు నిర్వహించేందుకు ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమావేశమయ్యారు. జీవో నెం. 3 అమలు, 1/70 చట్టం అమలు, భూ హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమ

జీవో నంబర్-3 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం
గిరిజనుల సమస్యలపై సమగ్ర చర్చలు నిర్వహించేందుకు ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమావేశమయ్యారు. జీవో నెం. 3 అమలు, 1/70 చట్టం అమలు, భూ హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై గిరిజన సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను మంత్రి, అధికారులు తెలుసుకున్నారు. సమావేశంలో 40 గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా హాజరై గిరిజనుల సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన సంఘాల నుంచి వచ్చిన సూచనలు, వినతులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Andhra Pradesh
GO No. 3
Tribal Welfare
Gummidi Sandhya Rani
Tribal Rights
1/70 Act
Land Rights
Scheduled Tribes
గిరిజన సంఘాలు
గిరిజన అభివృద్ధి
సంక్షేమ పథకాలు
విద్య
Scroll for the next article