News3rd May 01:22 PMSunil Byrisetty1 min read
త్వరలోనే ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ
ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ రాబోతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడాన
ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ రాబోతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్-2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా తమ సహకారాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు.
మే 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు తొలిసారి ఇండియాలో ప్రత్యేకించి ముంబయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వేవ్స్ (ది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్) సమ్మిట్ -2025 లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ జరిగిందని తెలిపారు.
ఈ ఎంవోయూ ద్వారా ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్క్‌లు, గేమింగ్ జోన్‌లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
అంతేకాక ఉద్యోగ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఎంవోయూ దోహదం చేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు.