News14th Jun 03:10 PMSunil Byrisetty1 min read

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల సొంత డబ్బు అందజేస్తానని మురళి నాయక్ అంత్యక్రియలు సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల సొంత డబ్బు అందజేస్తానని మురళి నాయక్ అంత్యక్రియలు సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మురళి నాయక్ తల్లిదండ్రులకు జనసేన ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు (తిరుపతి) నిమ్మల జయకృష్ణ (పాలకొండ) అహుడ చైర్మన్ TC వరుణ్ తో పాటు మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి పలువురు జనసేన ముఖ్య నేతలు మురళీనాయక్‌ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్యేల చేతులమీదుగా మురళి నాయక్ తల్లిదండ్రులకు చెక్ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు చెప్పారు.
Andhra Pradesh news
Deputy CM pawan kalyan
Army Jawan Murali Naik Family
వ్యక్తిగతంగా రూ. 25 లక్షల సాయం
మురళి నాయక్ అంత్యక్రియలు లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు
మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు
Scroll for the next article