News6th Apr 11:07 AMSunil Byrisetty1 min read

పల్నాడుకు మహర్దశ.. కేంద్రం చొరవ!

రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. గత ఐదేళ్లలో నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలని నిర్ణయించాయి. ప్రధానంగా జాతీయ రహదా

పల్నాడుకు మహర్దశ.. కేంద్రం చొరవ!
రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. గత ఐదేళ్లలో నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలని నిర్ణయించాయి. ప్రధానంగా జాతీయ రహదారులపై కేంద్రం, గ్రామ స్థాయి రోడ్ల నిర్మాణాలపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మాచర్ల వరకు జాతీయ రహదారి 167 ఏడీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గురజాల, రెంటచింతల మాచర్లలో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ బైపాస్‌ల నుంచి వెళ్లే 13.16 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ. 54.9 కోట్లు మంజూరు చేసింది. కిలోమీటర్‌కు రూ. 4.1 కోట్లు చొప్పున అంచనా వ్యయం కానుంది. జిల్లాలోని గురజాల, రెంటచింతల మాచర్ల లోని బైపాస్ రోడ్ల నిర్మాణం ఇందులో భాగంగా చేపడతారు. ఆయా పట్టణాల నుంచి వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిధులు ఇవ్వడంతో త్వరలోనే టెండర్లను పిలిచి పనులను మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పి దాచేపల్లి నుంచి మాచర్ల వెళ్లడం సులువుతుంది.
AP Govt
National Highways
Palnadu
Projects
Chandrababu
రెంటచింతల మాచర్లలో బైపాస్ రోడ్ల
జాతీయ రహదారి నిర్మాణం
Scroll for the next article