News2nd Oct 03:56 PMSunil Byrisetty1 min read
సోషల్ మీడియాపై మంత్రుల కమిటీ
సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ దూషించే ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సోషల్ మీడియా నియంత్రణ, బాధ్యత, పౌర హక్కుల రక్షణ వంటి అంశాలపై సమగ్ర పరిశీలన చేయడాని
సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ దూషించే ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సోషల్ మీడియా నియంత్రణ, బాధ్యత, పౌర హక్కుల రక్షణ వంటి అంశాలపై సమగ్ర పరిశీలన చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత సభ్యులు. ఈ కమిటీ భారత్‌లో సోషల్ మీడియా కోసం ఉన్న చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలను సమీక్షిస్తుంది.
అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసి, పారదర్శకత, ప్లాట్‌ఫార్ముల బాధ్యత, వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై విశ్లేషణ చేయనుంది. హానికర కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ దాడులు, జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్న అంశాలను నియంత్రించడానికి సూచనలు ఇస్తుంది. ఫిర్యాదులు పరిష్కరించడానికి స్పష్టమైన విధానం సూచించనుంది.