News24th Jul 09:47 AMSunil Byrisetty1 min read

మత్స్యకారుని కుటుంబానికి 10 లక్షలు

గార మండలం బందరువానిపేటకు చెందిన మత్స్యకారుడు బడి గజేంద్ర మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ప్

మత్స్యకారుని కుటుంబానికి 10 లక్షలు
గార మండలం బందరువానిపేటకు చెందిన మత్స్యకారుడు బడి గజేంద్ర మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ పరిహారంలో ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, మత్స్యశాఖ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి భరోసా ఇచ్చిందని, అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సాయం మంజూరు చేయడం వల్ల మృతుడి కుటుంబానికి తక్షణ భరోసా లభించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Andhra Pradesh
Fisherman Death
Compensation
Kinjarapu Achchennaidu
Chandrababu Naidu
Gajendra Death
Fishing Safety
Bandaru Vanipeta
Fisheries Department
మత్స్యకారుని కుటుంబానికి 10 లక్షలు
మత్స్యకారుల భద్రత
Scroll for the next article