News9th Dec 12:05 PMSunil Byrisetty1 min read

ఏఐ వర్సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి

ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... “ఒక కుటుంబంలో

ఏఐ వర్సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి
ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... “ఒక కుటుంబంలో ఒక AI ఆధారిత సభ్యుడు” అనే లక్ష్యాన్ని సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం. ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం మాతో కలిసి పనిచేయండి. తొలిదశలో ఏపీలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్ జీపీటీ అందించాలని భావిస్తున్నాం. ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. డేటా సెంటర్ హబ్ గా మారుతున్న ఏపీని ఓపెన్ ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు ఎంపిక చేసుకోవాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస్ నారాయణన్ మాట్లాడుతూ... ఎంటర్ ప్రైజ్ ఏఐ ఇంటిగ్రేషన్ కోసం ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ 180కి పైగా దేశాల్లో వినియోగదారులు, సంస్థలకు సేవలు అందిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చర్చిస్తామని అన్నారు.
Andhra Pradesh
Nara Lokesh
OpenAI
Srinivas Narayanan
AI University
AP Government
Data Center Hub
ChatGPT Access
AI Skills
Technology Collaboration
విద్యా సంస్కరణలు
డిజిటల్ ఏపీ
ఇన్ఫోసిస్
టీసీఎస్
టెక్ పార్ట్‌నర్‌షిప్
ఏఐ ఇంటిగ్రేషన్
Scroll for the next article