News3rd Jun 10:30 AMSunil Byrisetty1 min read

తుని రైలు దహనం కేసులో కీలక మలుపు!

ఏపీ ప్రభుత్వం కాపు నేతలపై వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన కేసులపై పునర్విచారణ కోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తుని రైలు దహనం కేసులో కీలక మలుపు!
ఏపీ ప్రభుత్వం కాపు నేతలపై వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన కేసులపై పునర్విచారణ కోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ 2016లో తుని సమీపంలో ముద్రగడ పద్మనాభం సహా ఇతర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అటుగా వెళుతున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తగుల పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించి సంపూర్ణ దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా ముద్రగడ సహా కీలక నేతలందరిపై కేసులు నమోదు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసు కొట్టివేతపై భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNS ) 2023 యాక్ట్ నెంబర్ 46 ప్రకారం పై కోర్టుకు అప్పీలుకు వెళ్లాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది. కూటమి ప్రభుత్వం కేసు పునర్విచారణకు ఆదేశించడాన్ని వైయస్సార్సీపీ కాపులపై కక్షగా చూపిస్తోంది.
Andhra Pradesh news
tuni
tunitrainincident
train burning
తుని రైలు దహనం కేసు
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం
Scroll for the next article