News2nd Aug 04:30 PMSunil Byrisetty1 min read

రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం

రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ

రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం
రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని ఏపీఐఐసీ (APIIC) కాలనీ లో గల రైతు బజార్‌లో ప్రారంభించారు. గతంలో కిలో రూ.64–65 వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్‌ను ప్రస్తుతం కేవలం రూ.52 కు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్‌ ధరల నియంత్రణపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. వినియోగదారులపై నిత్యావసర వస్తువుల ధరల భారం పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Nadendla Manohar
Rice Prices
BPT Steam Rice
Consumer Affairs
Civil Supplies
రైతు బజార్
విజయవాడ
ధరల నియంత్రణ
కూటమి ప్రభుత్వం
నిత్యావసర వస్తువులు
Scroll for the next article