News22nd Jul 04:42 PMSunil Byrisetty1 min read
భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామకంఠం, పట్టా, అసైన్డ్ భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టనుంది. 22A జాబితాలో చేరిన భూములపై ప్రత్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామకంఠం, పట్టా, అసైన్డ్ భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టనుంది. 22A జాబితాలో చేరిన భూములపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తోంది. రికార్డుల ప్రక్షాళనపై కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల్లో ప్రక్షాళన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 45 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. రికార్డుల ప్రక్షాళనపై ప్రత్యేక యాప్ ను కూడా తీసుకురానుంది. ఇకపై ఐజీ ఆధ్వర్యంలోనే 22A డేటాబేస్ నిర్వహించాలని నిర్ణయించింది. తప్పుగా 22Aలో చేరిన భూములను దశలవారీగా తొలగింపు చేయనుంది. 22Aలోని ప్రతి ఫైల్‌ను అధికారులు పరిశీలించాలని సూచించింది. భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, రాష్ట్ర, జిల్లా కమిటీలు, ఆడిటర్‌లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనుంది. 15 రోజుల్లో ఫైళ్ల పరిశీలన పూర్తి చేయాలని, 30 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.