News14th Jul 04:19 PMSunil Byrisetty1 min read

ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు

బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు వ

ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు
బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. కొండేపి నియోజక వర్గంలోని సింగరాయకొండలో మంత్రులు పర్యటించారు. అక్కడ రూ.65 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం టంగుటూరు ఎంజేపీ గురుకుల బాలిక పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా పరుగులు తీయిస్తోందన్నారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకుల పాఠశాలలకు భవనాలు నిర్మిస్తున్నామన్నారు. అనంతరం హలో... నమస్కారమండీ బాగున్నారమ్మా..? మేం మంత్రులం మాట్లాడుతున్నామంటూ పే ఫోన్ ద్వారా విద్యార్థినుల తల్లిదండ్రులను మంత్రులు పలకరించారు.
Andhra Pradesh
AP Government
Gurukul Schools
Residential Schools
Student Welfare
BC Students
మంత్రి సవిత
డోలా బాల వీరాంజనేయస్వామి
కూటమి ప్రభుత్వం
Scroll for the next article