News29th Nov 11:49 AMSunil Byrisetty1 min read

రాజధాని కోసం మళ్లీ ల్యాండ్ పూలింగ్!

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు మరో విడత ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కోసం మరో ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని కేబినెట్ నిర్ణయించ

రాజధాని కోసం మళ్లీ ల్యాండ్ పూలింగ్!
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు మరో విడత ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కోసం మరో ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విధివిధానాలను మంత్రుల సబ్ కమిటీ ఖరారు చేయనుంది. గతంలోనే ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామసభలు నిర్ణయించారు. కానీ మొదటి దశ అమరావతి పనులు పూర్తిగా పట్టాలెక్కక ముందే ఇలా చేయడంతో రైతులు ఆసక్తి చూపించలేదు. ముందుగా మొదటి దశలో రైతులకు న్యాయం చేయాలన్నారు. దీంతో అప్పటికి ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు సమాంతరంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండటంతో.. రైతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గతంలో అధికారులు సరిగ్గా హ్యాండిల్ చేయలేదని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన తర్వాత రైతులు అంగీకరించారని అన్నారు.
Amaravati
Land Pooling
AP Government
Chandrababu Naidu
Capital Development
Infrastructure
Farmers
Cabinet Meeting
Scroll for the next article