News17th Jul 05:19 PMSunil Byrisetty1 min read

పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలి

రాష్ట్రంలో వ‌ర్జినీయా (FCV) పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు టోబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ

పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలి
రాష్ట్రంలో వ‌ర్జినీయా (FCV) పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు టోబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లు, రైతులకు లభిస్తున్న ధరలు, మార్కెట్ పరిస్థితులు, కొనుగోళ్ల వేగవంతంపై విస్తృతంగా సమీక్షించారు. నాలుగు రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా ఊపందుకున్నాయని, ప్రస్తుతం రోజుకు సుమారు 8.5 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్ఠంగా కిలోకు రూ.250 వరకు ధర లభిస్తోందని, రైతులకు మరింత మెరుగైన ధర వచ్చేలా కొనుగోలు సంస్థలతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోలు సంస్థలపై సమర్థవంతమైన ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు ఇంకా అధిక ధర లభించేలా చర్యలు చేపట్టాలని టొబాకో బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సూచించారు. కొనుగోళ్లు మరింత వేగవంతం కావడం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
Andhra Pradesh
Tobacco Farmers
Achchennaidu
FCV Tobacco
Tobacco Board
Tobacco Procurement
పొగాకు రైతులు
గిట్టుబాటు ధర
వ్యవసాయం
రైతు సంక్షేమం
Scroll for the next article