News11th Aug 03:35 PMSunil Byrisetty1 min read

ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు

స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. 5 కేటగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిపించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. పల్లె వెలుగు,

ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు
స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. 5 కేటగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిపించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లభించనుంది. మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. బాలికలు, మహిళలు, ట్రాన్సజెండర్లు బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం పొందవచ్చు. అదే తిరుమల - తిరుపతి మధ్య సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని, నాన్ స్టాప్, అంతరాష్ట్ర బస్సు సర్వీస్ లో ఉచిత ప్రయాణం వర్తించదని కాంతిలాల్ దండే సూచించారు. సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ బస్సులో ఉచిత ప్రయాణం పథకం వర్తించదని, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్,ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని స్పష్టం చేశారు. అలాగే బస్సులో రద్దీ పెరగనున్న దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh
Women Empowerment
Free Bus Travel
RTC Buses
CCTV cameras in buses
Express buses
Palle Velugu
City Ordinary
ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు
Scroll for the next article