News31st Jul 03:42 PMSunil Byrisetty1 min read
మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు రాజధాని రైతు కూలీ పింఛన్లను పునరుద్ధరించింది. దీంతో వా
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు రాజధాని రైతు కూలీ పింఛన్లను పునరుద్ధరించింది. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో రైతు కూలీలు, భూమిలేని పేదలకు ప్రతి నెలా రూ.2,500 ల చొప్పున పంపిణీ చేసింది. అదే క్రమంలో రాజధాని గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడీలకు ఆశా కార్యకర్తలకు సైతం రాజధాని రైతు కూలీ పింఛన్లను పంపిణీ చేసింది. ఆగస్టు 1వ తేదీన వీరందరూ రూ.ఐదువేల చొప్పున రైతు కూలీ పింఛన్లు అందుకోనున్నారు. కాగా సాంకేతిక కారణాలవల్ల కొందరి పారిశుధ్య కార్మికులకు, ఆశాలకు అంగన్వాడీలకు రైతు కూలీ పింఛన్ పునరుద్ధరణ కాలేదని, పరిశీలించి వారికి కూడా వీలైనంత త్వరలోనే రైతు కూలీ పింఛన్లను మంజూరు చేయనున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు.