News7th Nov 02:38 PMSunil Byrisetty1 min read

శ్రీ చరణికి ప్రభుత్వం గిఫ్ట్.. బహుమతిగా రూ.2.5 కోట్లు

మహిళా క్రికెట్ టీంలో తనదైన ప్రతిభ ప్రదర్శించిన శ్రీచరణిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. వన్డే ప్రపంచకప్లో సత్తా చాటిన తెలుగు తేజం, మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఆంధ్రప్రదేశ

శ్రీ చరణికి ప్రభుత్వం గిఫ్ట్.. బహుమతిగా రూ.2.5 కోట్లు
మహిళా క్రికెట్ టీంలో తనదైన ప్రతిభ ప్రదర్శించిన శ్రీచరణిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. వన్డే ప్రపంచకప్లో సత్తా చాటిన తెలుగు తేజం, మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతోపాటు.. కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచకప్ గెలుచుకోవడం ద్వారా టీన్ఇండియా జట్టు సత్తా చాటిందని.. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు.
AP Government Felicitation
CM Chandrababu Naidu
Sricharani
Women’s Cricket
World Cup Winner
₹2.5 Crore Cash Prize
Group 1 Job
House Site in Kadapa
Minister Nara Lokesh
Mithali Raj
Women Empowerment
Telugu Pride
Sports Recognition
Scroll for the next article