News12th Sep 02:15 PMSunil Byrisetty1 min read
మహిళా దినోత్సవానికి లక్ష మంది వ్యాపారవేత్తలు
ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆశయంతో వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందిని వ్యాపారవేత్తలుగా తయారుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశ
ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆశయంతో వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందిని వ్యాపారవేత్తలుగా తయారుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వేను ప్రారంభించనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. అధికారులు నేరుగా మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వేలో గుర్తించిన అర్హులైన మహిళలకు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించనుంది. బ్యాంకుల ద్వారా కనిష్ఠంగా రూ. 10 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్త్రీనిధి పథకం ద్వారా రూ. లక్ష వరకు, ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం కింద రూ. 2 లక్షల నుంచి అవసరాన్ని బట్టి రూ. 10 లక్షల వరకు కూడా రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, యూనిట్ విస్తరణకు రుణాలు పొందాలంటే, ఆ వ్యాపారం ద్వారా కనీసం మరొకరికి ఉపాధి కల్పించాలనే నిబంధనను పాటించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.