Politics2nd Mar 06:58 PMSunil Byrisetty1 min read
సీఐడీ మాజీ ఏడీజీపై సస్పెన్షన్ వేటు!
వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగ
వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభు ఇచ్చిన వివరాలను డివియేట్ చేసి దుబాయ్ లో సునీల్ కుమార్ పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK 525 లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK 526 లో హైదరాబాద్ తిరిగి వచ్చారు.
ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లగించి పలుమార్లు ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసిన నేపథ్యంలో సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.