News6th Aug 08:06 AMSunil Byrisetty1 min read

ఏపీలో చేనేతకు చేయూత!

చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత శాఖపై సచివాలయంలో సీఎం సమీక్షించారు.

ఏపీలో చేనేతకు చేయూత!
చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత శాఖపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేతే అత్యంత కీలకమైన రంగంగా ఉందని.. దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ మేరకు ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు.. అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh news
handloom policy
CM Chandrababu
free electricity for handloom
powerloom electricity subsidy
jammalamadugu
AP textile sector
handloom worker welfare
ఆంధ్రప్రదేశ్ చేనేత
నేతన్నలకి ఉచిత విద్యుత్
చేనేత రంగం
చంద్రబాబు చేనేత సమీక్ష
Scroll for the next article