News25th Jul 04:33 PMSunil Byrisetty1 min read
ఆగష్టు నుంచి కొత్త పెన్షన్
అర్హులైనవారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగష్టు నుంచి దాదాపు లక్షమందికి పైగా పెన్షన్లు ఇవ్వనున్నారు.ఇప్పటివరకు పెన్షన్ అందని వారు లబ్ధిదారులగా పేరును నమోదు చేసు
అర్హులైనవారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగష్టు నుంచి దాదాపు లక్షమందికి పైగా పెన్షన్లు ఇవ్వనున్నారు.ఇప్పటివరకు పెన్షన్ అందని వారు లబ్ధిదారులగా పేరును నమోదు చేసుకోవచ్చు. ఆగష్టు నుంచి ఒక లక్షా 9 వేల 155 మందికి కొత్త పెన్షన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. అర్హులైన వారు ఎవ్వరూ పెన్షన్ తీసుకోకుండా ఉండకూడదనే ఆలోచనతో ఇప్పుడు మళ్లీ పెన్షన్ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఎవరైనా పెన్షన్ పొందుతున్న భర్తలు చనిపోతే, వారి భార్యలు ఈ పెన్షన్లకు అర్హులు. గతంలో కూడా ఇలాంటి వితంతు పెన్షన్లు ఇచ్చారు. కాదంటే ఇంకా చాలామంది కొత్తవారు ఉండిపోయారు. వారికోసమే ప్రభుత్వం ఇపుడు ఈ నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోతే కచ్చితంగా భార్యకు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.