Notifications22nd Nov 09:45 AMSunil Byrisetty1 min read
త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ
మెగా డీఎస్సీతో ఏపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన మంత్రి నారా లోకేష్ మరో కీలక విభాగంపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్త
మెగా డీఎస్సీతో ఏపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన మంత్రి నారా లోకేష్ మరో కీలక విభాగంపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని, విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. దీంతో దాదాపు 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అధ్యాపక పోస్టులు భర్తీ కానున్నాయి.