News29th Sep 12:57 PMSunil Byrisetty1 min read

డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కొత్త శుభవార్త అందించింది. స్త్రీనిధి కింద రెండు ప్రత్యేక పథకాలు ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి & ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పేరుతో

డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కొత్త శుభవార్త అందించింది. స్త్రీనిధి కింద రెండు ప్రత్యేక పథకాలు ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి & ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పేరుతో మహిళల కోసం ఈ పథకాలు రాబోతున్నాయి. డ్వాక్రా సంఘంలో కనీసం 6 నెలలు పూర్తిచేసిన సభ్యురాలు అర్హులుగా తెలిపారు. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నవారికి వర్తించనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువులకు రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణసహాయం అందిస్తారు. దరఖాస్తు చేసిన 48 గంటల్లో ఖాతాలో నేరుగా నగదు జమవుతుంది. ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద డ్వాక్రా సభ్యురాలి కుమార్తె వివాహ ఖర్చులకు రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణం అందించనున్నారు.
Andhra Pradesh
Government scheme
DWACRA Women
Stree Nidhi
NTR Vidyalakshmi
NTR Kalyana lakshmi
Women Empowerment
Education Loan
స్వయం సహాయక సంఘాలు
సంక్షేమ పథకాలు
డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణం
Scroll for the next article