News16th Aug 05:02 PMSunil Byrisetty1 min read
గీత కార్మికులకు మోపెడ్లు
త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని శ్రీకారం చుడుతున్నామని, ఈ పథకం ద్వారా గీత కార్మికులకు మోపెడ్ ద్విచక్ర వాహనాలు అందజేయబోతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎ
త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని శ్రీకారం చుడుతున్నామని, ఈ పథకం ద్వారా గీత కార్మికులకు మోపెడ్ ద్విచక్ర వాహనాలు అందజేయబోతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత మాట్లాడుతూ ఆదరణ 3.0 పథకం ద్వారా కుల వృత్తుదారులకు అత్యాధునిక పనిముట్లు ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గీత కార్మికులకు మోపెడ్ ద్విచక్ర వాహనాలతో పాటు తాటిచెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు అందజేయనున్నామన్నారు. రంపచోడవరంలోరి హార్టీకల్చర్ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారుచేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే రంపచోడవరంలో పరిశోధనా కేంద్రానికి సందర్శించనున్నట్లు వెల్లడించారు.