News14th Jul 10:29 AMSunil Byrisetty1 min read

మినీ మార్టులుగా చౌక డిపోలు!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలను ఇకపై మినీ సూపర్ మార్కెట్లుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నిర్ణయం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీ ధరలకే నిత్యావసర సరుకు

మినీ మార్టులుగా చౌక డిపోలు!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలను ఇకపై మినీ సూపర్ మార్కెట్లుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నిర్ణయం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీ ధరలకే నిత్యావసర సరుకులను అందించడంతో పాటు డీలర్ల ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 29,794 రేషన్ దుకాణాలు ఉండగా.. తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలను ఎంపిక చేశారు. కనీసం 200 చదరపు అడుగుల స్థలం ఉన్న 533 దుకాణాలను ఈ విధానంలోకి మార్చనున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో ఈ నెలలోనే ప్రయోగాత్మకంగా 10 మార్టులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరలకే నాణ్యమైన బ్రాండెడ్ నిత్యావసర వస్తువులు ఈ మార్టులలో లభిస్తాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ సాధించే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా అన్ని రేషన్ దుకాణాలను దశలవారీగా మినీ మార్టులుగా మార్చనున్నారు.
Andhra Pradesh
AP Government
Ration Shops
Fair Price Shops
Mini Marts
Public Distribution System
PDS
Subsidy
గుంటూరు
కృష్ణా జిల్లా
ఏలూరు
ఎన్టీఆర్ జిల్లా
ఆహార సరఫరాలు
వినియోగదారుల సంక్షేమం
Scroll for the next article