News2nd Jul 12:02 PMSunil Byrisetty1 min read

గతేడాదిని మించి జీఎస్టీ వసూళ్లు

ఏపీలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్‌ నెలకు ఇదే అత్యధికంగా ఉంది. 2025-26 ఆర

గతేడాదిని మించి జీఎస్టీ వసూళ్లు
ఏపీలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్‌ నెలకు ఇదే అత్యధికంగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం వసూలైన నికర జీఎస్టీ రూ.8,860 కోట్లు ఉండగా.. గతేడాది ఇదే సమయంలో వసూలైన నికర జీఎస్టీ కన్నా 3.4 శాతం ఎక్కువ. క్యూ1లో మొత్తం పన్ను ఆదాయం రూ.13,361 కోట్లు వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వచ్చిన రూ.13,096 కోట్ల కంటే ఇది 2.02 శాతం ఎక్కువ. అలాగే, ఈ ఏడాది జూన్‌లో పన్ను ఆదాయం రూ.4,167.66 కోట్లు వచ్చింది. గతేడాది జూన్‌లో వచ్చిన రూ.3,910 కోట్ల పన్ను ఆదాయం కంటే ఇది 6.58 శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్‌లో ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ రూ.1,365 కోట్లు వచ్చింది. వృత్తి పన్ను రూ.29 కోట్ల నుంచి రూ.49 కోట్లకు పెరిగింది. లిక్కర్‌పై వ్యాట్‌ రూ.61 కోట్ల నుంచి రూ.86 కోట్లకు, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ రూ.1,380 కోట్ల నుంచి రూ.1,435 కోట్లకు పెరిగింది.
Andhra Pradesh news
GST collection
june month
Tax Revenue
జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి
6.58 శాతం ఎక్కువ
Scroll for the next article