News6th Aug 11:49 AMSunil Byrisetty1 min read

హస్తకళలకు సాంకేతిక వెలుగులు..!

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో 'ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానం' ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ శ్రీకా

హస్తకళలకు సాంకేతిక వెలుగులు..!
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో 'ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానం' ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. కళాఖండం చరిత్ర చెప్పేస్తుంది.. కళాకారుడి కష్టాన్ని వివరిస్తుంది. అంతే కాకుండా నకిలీ ఉత్పత్తుల నిరోధానికీ అవకాశం లభిస్తుంది. మొదటి దశలో ఏపీలోని విభిన్న సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ ప్రొఫైల్స్‌ కేటాయించడం జరిగింది. బొబ్బిలి వీణతోపాటు, సంపూర్ణ రామాయణం, మహాభారతం, శ్రీ కృష్ణలీలా, మత్స్యావతారం కలంకారి పెయింటింగ్స్, సవర ఆదివాసి పెయింటింగ్స్ ఉన్నాయి.
Andhra Pradesh
AP Handicrafts
Pawan Kalyan
QR Code
AP Handicrafts Development Corporation
Digital Initiative
సవర ఆదివాసి చిత్రకళ
హస్తకళలు
సాంస్కృతిక వారసత్వం
సంప్రదాయ కళలు
Scroll for the next article