News30th Jul 06:13 PMSunil Byrisetty1 min read

కేంద్ర మంత్రుల్ని కలిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

న్యూఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. శ్రీ సత్య సాయి, ఎ

కేంద్ర మంత్రుల్ని కలిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
న్యూఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. శ్రీ సత్య సాయి, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ రహదారుల విస్తరణ, కొత్త మార్గాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో రూ.9,500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కోసం ఆగస్టు 2న ఏపీకి నితిన్ గడ్కరీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ పర్యటన ఏర్పాట్ల గురించి ఆయనకు మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కూడా మర్యాదపూర్వకంగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి చర్చించారు. అలాగే రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని మంత్రి సత్యకుమార్ కోరారు.
Andhra Pradesh news
Satya kumar yadav
Nitin Gadkari
Ashwini vaishnaw
Railway projects
Road Development
కేంద్ర మంత్రుల్ని కలిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
Scroll for the next article