News20th May 01:28 PMSunil Byrisetty1 min read
వెదర్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు?
ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, సీమ మీదుగా నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొ
ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
దక్షిణ కోస్తా, సీమ మీదుగా నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది.
దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది.
దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయు.
మరోవైపు కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే సూచనలు ఉన్నాయి