News9th Sep 08:30 AMSunil Byrisetty1 min read
పవన్ తో పెట్టుకుంటే ఇంతే!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. సినిమాలు, టికెట్ల ధరల పెంపు వ్యవహారం హైకోర్టుకు చేరింది. పవన్ కళ్యాణ్ మంత్రై ఉండి సినిమాలు తీయడంపై అభ్యంతరం వ్య
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. సినిమాలు, టికెట్ల ధరల పెంపు వ్యవహారం హైకోర్టుకు చేరింది. పవన్ కళ్యాణ్ మంత్రై ఉండి సినిమాలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ఏజీ కోర్టును కోరారు. పిటిషనర్ మెమోను సవాల్ చేయలేదని తెలిపారు. ప్రాథమిక అంశాలను పరిశీలించకుండా పిటిషన్ వేయడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని అన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌కు ఖర్చులు విధించి పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.