News27th Jun 04:04 PMSunil Byrisetty1 min read

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా!

పల్నాడు కారు ప్రమాదం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జూలై 1కి

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా!
పల్నాడు కారు ప్రమాదం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జూలై 1కి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. జూన్ 18వ తేదీన వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటిస్తున్న క్రమంలో సింగయ్య అనే వృద్దుడు ప్రమాదవశాత్తు జగన్ కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. ఈ కేసును క్వాష్ చేయాలంటూ వీరంతా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
Andhra Pradesh news
AP POLITICS
ysrcp leaders
High court
Quash petition on singaiah death case
సింగయ్య మృతి కేసు
జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ జూలై 1కి వాయిదా
Scroll for the next article