TTD27th Oct 01:51 PMSunil Byrisetty1 min read
సీఐడీకి టీటీడీ పరకామణి వ్యవహారం
టీటీడీ పరకామణి వ్యవహారంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ కేసులో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వుల
టీటీడీ పరకామణి వ్యవహారంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ కేసులో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై దర్యాప్తునకు ఆదేశించింది. రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు పరిశీలించాలని ఆదేశించింది.