News28th Jun 12:48 PMSunil Byrisetty1 min read
విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌పై సీరియస్ అయింది. ఈ కేసులో భాగంగా కమిషనర్ విజయరామరాజు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కమిషనర్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది.