Jobs28th May 01:52 PMSunil Byrisetty1 min read
నిరుద్యోగులకు శుభవార్త.. 1620 పోస్టులు
ఏపీలో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయను
ఏపీలో భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దీని ద్వారా మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 13 నుంచి ప్రారంభమైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.
జూనియర్ అసిస్టెంట్ - 230 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ - 651 పోస్టులు, ప్రాసెస్ సర్వర్ - 164 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 24 పోస్టులు, కాపీయిస్ట్ - 193 పోస్టులు, ఎగ్జామినర్ - 32 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు, టైపిస్ట్ - 162 పోస్టులు, స్టెనోగ్రాఫర్ - 80 పోస్టులు, డ్రైవర్ - 28 పోస్టులు ఉన్నాయి.
వీటిని జిల్లాలవారీగా భర్తీ చేయనున్నారు. ఏపీ హై కోర్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.
జూన్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ.800, SC, ST, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది.
అదే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ విద్యార్హతగా ఉండాలి.
అలాగే టైపిసట్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
కాగా టైపింగ్, కంప్యూటర్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
42 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులు.
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
https://aphc.gov.in/aphc_old/