News14th Oct 09:23 AMSunil Byrisetty1 min read

పోలీస్ స్టేషన్లను మూసేయండన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను మూసివేయడం మేలని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తిరుపత

పోలీస్ స్టేషన్లను మూసేయండన్న హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను మూసివేయడం మేలని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తిరుపతి పరకామణి కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖ పనితీరుపై నిప్పులు చెరిగింది. రికార్డులు సీజ్ చేయమని సెప్టెంబర్ 19వ తేదీన ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి పోలీసులు సహకరించారని ఆరోపించింది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
Andhra Pradesh High Court
AP Police
CID
DGP
Tirupati Case
Court Orders
హైకోర్టు విచారణ
ఆంధ్రప్రదేశ్ సమాచారం
న్యాయ వ్యవస్థ
తిరుపతి పరకామణి కేసు విచారణ
Scroll for the next article