News23rd Sep 12:06 PMSunil Byrisetty1 min read

ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు స్టే!

ఆక్వా రైతులకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏకపక్ష ధరల పెంపును ఆక్వా రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ‘అప్సడా’ చట్టం ని

ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు స్టే!
ఆక్వా రైతులకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏకపక్ష ధరల పెంపును ఆక్వా రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ‘అప్సడా’ చట్టం నిబంధనల ఉల్లంఘనపై ఫీడ్ కంపెనీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ కారణాల వలనే ధరల పెంచినట్లు ఫీడ్ కంపెనీలు తెలిపాయి. అక్టోబర్ 8 లోపు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సమావేశానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Scroll for the next article