News1st Oct 12:17 PMSunil Byrisetty1 min read
34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను కొట్టివేసింది. మొ
34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 59 శాతానికి మించకూడదన్న ధర్మాసనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవోలు చెల్లవని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీలకు 34 శాతం కోటాతో 50 శాతం పరిధి దాటుతుందని జీవోలను హైకోర్టు రద్దు చేయడంపై అప్పీల్ చేయనుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామంటున్న ఏపీ ప్రభుత్వం ఆ మేరకు తక్షణం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.