News17th May 03:57 PMSunil Byrisetty1 min read

మానవత్వం చాటిన హోం మంత్రి అనిత

హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మరోసారి మానవత్వం చాటారు. విశాఖపట్నం తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి అచేతన స్థితిలో పడిన ఓ యువకుడిని చూసి చలించిపోయార

మానవత్వం చాటిన హోం మంత్రి అనిత
హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మరోసారి మానవత్వం చాటారు. విశాఖపట్నం తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి అచేతన స్థితిలో పడిన ఓ యువకుడిని చూసి చలించిపోయారు. అటుగా ఎయిర్ పోర్ట్‌కు వెళుతున్న హోంమంత్రి ఘటనని చూసి తక్షణం కాన్వాయ్‌ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన ఓ వృద్ధురాలు సహా పలువురికి ఏం కాదమ్మా.. అంటూ ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించడం కోసం సమీప హాస్పిటల్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Visakhapatnam
ap home minister anitha
humanity
తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం
హోంమంత్రి ఘటనని చూసి తక్షణం కాన్వాయ్‌ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు
Scroll for the next article