Politics19th Mar 03:10 PMSunil Byrisetty1 min read

7.2 శాతం నేరాలు తగ్గితే..క్రైమ్ తగ్గినట్లు కాదా?

గత ప్రభుత్వం కన్నా 7.2 శాతం నేరాలు తగ్గితే..క్రైమ్ తగ్గినట్లు కాదా అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గణాంకాలతో సహా చెబుతున్నా సందేహాలెందుకని ప్రశ్నించారు. 2023 జూన్ నుంచి 2024 జ

7.2 శాతం నేరాలు తగ్గితే..క్రైమ్ తగ్గినట్లు కాదా?
గత ప్రభుత్వం కన్నా 7.2 శాతం నేరాలు తగ్గితే..క్రైమ్ తగ్గినట్లు కాదా అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గణాంకాలతో సహా చెబుతున్నా సందేహాలెందుకని ప్రశ్నించారు. 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకూ మహిళలపై జరిగిన నేరాలు 18,114 అయితే, 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకూ మహిళలపై జరిగిన నేరాలు 16,809 అని వివరించారు. మహిళల భద్రత మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఐజీ స్థాయి మహిళా పోలీస్ ఆధ్వర్యంలో రూ.17 కోట్లతో ప్రత్యేక రక్షణ విభాగం ఏర్పాటు చేశామని చెప్పారు. డీఎస్పీ స్థాయి మహిళా పోలీసులు అందులో భాగంగా నియమించామన్నారు. అనకాపల్లిలో ట్రాన్స్‌జెండర్ హత్యను సీసీ కెమెరాల ద్వారా 18 గంటల్లోనే ఛేదించామని, నిందితుడిని పట్టుకోగలిగామంటే సీసీ టీవీ ఫుటేజ్ వల్లనేనని తెలిపారు. గన్నవరంలో బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ముందు అదృశ్య కేసుగా నమోదైందని, కృష్ణా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డ్రోన్లు,సీసీ టీవీల ద్వారా 3 రోజుల్లో ఛేదించామని వివరించారు. 24 గంటల్లోపే నిందితులను గుర్తించిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎన్ని శిక్షలు పడ్డాయని అడిగారు. గత మూడు నెలల కాలంలోనే విజయనగరంలోనే మూడు ఫోక్సో కేసుల్లో 20-25 సంవత్సరాలు శిక్ష పడిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అఘాయిత్యాలు తగ్గినట్లే కదా? తెలియడం లేదా అని ప్రశ్నించారు. మహిళల భద్రతపై చిత్తశుద్ధి ఉంది కూటమి ప్రభుత్వానికేనని అనిత స్పష్టం చేశారు.
varudu kalyani
vangalapudi anitha
disha app
AP Legislative Council
Scroll for the next article