Education25th May 11:18 AMSunil Byrisetty1 min read

ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల అప్డేట్!

ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ లో ప్రవేశాలకు దరఖాస్

ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల అప్డేట్!
ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న స్పెషల్ కేటగిరి విద్యార్థులకు ఈ నెల 28 నుంచి 31 వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. క్రీడలు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్, గైడ్స్ ధ్రువపత్రాలు ఉన్న విద్యార్థులకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు. దరఖాస్తు సమయంలో ప్రత్యేక కేటగిరి కింద దరఖాస్తు చేయడం మరచిపోయిన విద్యార్థులు కూడా నూజివీడులో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అవకాశం కల్పించామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Andhra Pradesh
IIIT
rgukt
students
certificates verfication
స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్
ట్రిపుల్ ఐటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన
Scroll for the next article