News15th Jul 04:22 PMSunil Byrisetty1 min read

వరుసగా రెండో ఏడాది ట్రూ డౌన్

దేశంలో ట్రూ-అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ట్రూ-డౌన్ అమలు చేసింది ఒక్క కూటమి ప్రభుత్వమేనని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా విద

వరుసగా రెండో ఏడాది ట్రూ డౌన్
దేశంలో ట్రూ-అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ట్రూ-డౌన్ అమలు చేసింది ఒక్క కూటమి ప్రభుత్వమేనని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మూడో ఏడాదిలోకి అడుగుపెట్టామని, ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ట్రాన్స్‌కోను బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించిన Rs.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని, నిర్ణీత గడువులో అవసరమైన అన్ని సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
AP Government
Gottipati Ravi Kumar
Andhra Pradesh
True Down
Electricity Tariff
Power Department
Energy Minister
ట్రాన్స్‌కో
సబ్‌స్టేషన్లు
విద్యుత్ ప్రాజెక్టులు
ఏపీ వార్తలు
Scroll for the next article