Education1st Apr 03:18 PMSunil Byrisetty1 min read

రిజల్ట్స్: వాట్సప్‌లో ఇంటర్ ఫలితాలు

ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్, మన మిత్ర కింద వందలాది సేవలు అందిస్తు్న్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు, అందులో ఇ

రిజల్ట్స్: వాట్సప్‌లో ఇంటర్ ఫలితాలు
ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్, మన మిత్ర కింద వందలాది సేవలు అందిస్తు్న్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు, అందులో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను వాట్సప్‌లో విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవతున్నారు. ఏప్రిల్‌ 12-15 మధ్య ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్‌ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్‌ ఉంటుంది. దీనికి ఐదారు రోజులు సమయం పడుతుంది. ఈసారి వాట్సప్‌లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడీఎఫ్‌ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే షార్ట్‌ మెమోలుగా ఉపయోగపడనున్నాయి. గతంలో ఫలితాలు ఇచ్చి, ఆ తర్వాత షార్ట్‌ మెమోలను ఆన్‌లైన్‌లో ఉంచేవారు. ఈసారి వాట్సప్‌లో ఫలితాలు ఇస్తున్నందున పీడీఎఫ్‌ రూపంలో మార్కులు ఇవ్వనున్నారు.
AP
Inter Results
Whatsapp
Scroll for the next article