News10th Apr 12:57 PMSunil Byrisetty1 min read

పర్యాటకాంధ్రగా ఏపీ.. ముంబయిలో వర్క్ షాప్

ఆతిథ్య రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ముంబయి పర్యటనకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ బృందం దాదాపు 20కి పైగా ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ముంబయిలోని ది

పర్యాటకాంధ్రగా ఏపీ.. ముంబయిలో వర్క్ షాప్
ఆతిథ్య రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ముంబయి పర్యటనకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ బృందం దాదాపు 20కి పైగా ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ముంబయిలోని ది వెస్టిన్ ముంబయి పోవై లేక్ లో ఏప్రిల్ 8-10 వరకు జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్‌లో భాగంగా మారియట్, ఐహెచ్ జీ, ఐహెచ్ సీఎల్, అకార్, చాలెట్, ఇమాజికా వరల్డ్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్, హమా, బీఎన్ కే గ్రూప్, వెంటివ్ హాస్పిటాలిటీ, పార్క్ హోటల్స్, లెమన్ ట్రీ, వెస్టిన్, బ్లాక్‌స్టోన్, హిల్టన్,సుబా హోటల్స్, ది బీచ్ ఎహెచ్ఎస్, అంబుజా నోటియా, ఎస్ఆర్ టీ హోటల్స్, రాయల్ ఆర్కిడ్ వంటి జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలతో భేటీ అయ్యారు. అదే విధంగా ఆతిథ్య రంగంలోని కీలక వాటాదారులు, పరిశ్రమ నాయకులు, హోటల్ పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, దక్షిణాసియా అంతటా ఉన్న ఇతర నిపుణులను కలిశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని తెలుపుతూ పర్యాటకులకు గమ్యస్థానాలుగా ఉన్న విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాల్లో లగ్జరీ రిసార్ట్స్, హోటల్స్ నెలకొల్పాలని ఆహ్వానించారు. పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలను పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కల్పిస్తామని స్పష్టంగా వివరించారు.
AP is the right platform for investments in the hospitality
Sector hospitality
Kandhula Durgesh
ఆతిథ్య రంగంలో పెట్టుబడులు
వెస్టిన్ ముంబయి
Scroll for the next article