News19th Aug 04:17 PMSunil Byrisetty1 min read
రూ.40 వేలు ఆర్థిక సహాయం చేసిన మంత్రి సుభాష్
రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామానికి ఒక మహిళకు, కె గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన మరో మహిళకు రూ. 20 వేలు చొప్పున మొత్తం రూ. 40 వేలు రాష్ట్ర కార్మిక శ
రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామానికి ఒక మహిళకు, కె గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన మరో మహిళకు రూ. 20 వేలు చొప్పున మొత్తం రూ. 40 వేలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే బొజ్జపు మంగ( జగన్నాథగిరి ), సన్నపు నాగమణి ల(శివల గ్రామం) ఆర్థిక పరిస్థితి బాలేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వీరిద్దరి దీనస్థితిని స్థానిక కూటమి పార్టీ నాయకులు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి తక్షణ సాయంగా చెరో రూ.20 వేలు చొప్పున చెక్కు ను ఆర్థిక సహాయంగా అందించారు. కష్టం అని తెలిసిన వెంటనే మానవతా దృక్పథంతో సహాయం చేసిన మంత్రి సుభాష్ కు మంగ, నాగమణితో పాటు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.