News21st Jan 12:55 PMSunil Byrisetty1 min read
మరోసారి భూముల విలువ పెంపు!
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను మరోసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను మరోసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి పెంచడం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 15 శాతం కంటే ఎక్కువగా పెంచారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం ద్వారా రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.