News23rd Jul 04:44 PMSunil Byrisetty1 min read
ఐటీని పెంచేందుకో పోర్టల్
ఎన్టీఆర్ జిల్లాను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, స్టార్టప్ కంపెనీల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను
ఎన్టీఆర్ జిల్లాను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, స్టార్టప్ కంపెనీల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. అందుకోసం జిల్లాలో అందుబాటులో ఉన్న కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూములు, ఐటీ కార్యకలాపాలకు అనువైన ఇతర ఆస్తుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ కోరారు. భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సులభంగా పరిశీలించి పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. జిల్లాలోని కమర్షియల్ భవనాల యజమానులు, కార్యాలయ సముదాయాల నిర్వాహకులు, భూ యజమానులు తమ ఆస్తుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలు, నమోదు ప్రక్రియపై సమాచారం కోసం జిల్లా ఐటీ అధికారి సుశ్యామ్ 84979 61902 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.