News23rd Sep 03:44 PMSunil Byrisetty1 min read
బాలలపై ఆన్లైన్ వేధింపుల అరికట్టడమే లక్ష్యం
బాలలపై ఆన్లైన్ వేధింపుల అరికట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో బాలల కోసం సురక్షితమైన ఇంటర్నెట్ (వెబ్ సేఫ్ అండ్ వైస
బాలలపై ఆన్లైన్ వేధింపుల అరికట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో బాలల కోసం సురక్షితమైన ఇంటర్నెట్ (వెబ్ సేఫ్ అండ్ వైస్) రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చైర్మన్ ఏ.వీ.ఎస్ వేటుకూరి. సూర్యనారాయణ రాజు నేటి డిజిటల్ యుగంలో బాలలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ ముప్పులను సైబర్ నేరాలను అరికట్టేందుకు స్వచ్ఛంద సంస్థ చైల్డ్ ఫండ్ ఇండియా భాగస్వామ్యంతో రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బాలలపై జరిగే ఆన్లైన్ లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, ఆన్లైన్ వంచన మరియు డిజిటల్ బ్లాక్మెయిలింగ్, సైబర్ బుల్లియింగ్, వంటి ముప్పుల నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బలమైన సురక్షిత డిజిటల్ వ్యవస్థను నిర్మించడమే ఈ ఉమ్మడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, రాష్ట్రస్థాయి యుహాహాత్మక మార్గదర్శకాల రూపకల్పన జరుగుతున్నదని తెలిపారు. పాఠశాల విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగము, పోలీస్ శాఖ ఇతర సంబంధించిన శాఖలతో కలసి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో ఈ వేధింపులకు సంబంధించి ఒక సర్వేను, ఒక పరిశోధన కూడా నిర్వహిస్తామని చెప్పారు. తద్వారా ఈ ఆన్లైన్ వేధింపులకు గురయ్యే బాల బాలికల స్థితిగతులను తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచిస్తామని పేర్కొన్నారు.